'ది ప్యారడైజ్' క్రేజీ డీల్!

‘హిట్ 3’ ఘన విజయంతో మరోసారి రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నాని. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూకుడుమీదున్న నాని సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఓ రేంజులో డిమాండ్ ఏర్పడుతుంది.;

By :  S D R
Update: 2025-05-15 04:55 GMT

‘హిట్ 3’ ఘన విజయంతో మరోసారి రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నాని. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూకుడుమీదున్న నాని సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఓ రేంజులో డిమాండ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా.. నాని నెక్స్ట్ మూవీ 'ది ప్యారడైజ్' ఆడియో డీల్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ తో 'ది ప్యారడైజ్'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాకి కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అది కూడా 'ది ప్యారడైజ్' ఆడియోకి క్రేజీ డీల్ రావడానికి కారణంగా చెబుతున్నారు.

లేటెస్ట్ గా 'ది ప్యారడైజ్' ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ గ్లోబల్’ ఏకంగా రూ.18 కోట్ల భారీ ధర చెల్లించి సొంతం చేసుకుందట. నాని - అనిరుధ్ కాంబినేషన్ లో ఇప్పటికే ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాలు వచ్చాయి. వీరి కలయికలో రాబోతున్న 'ది ప్యారడైజ్' ఆడియో పరంగా సంచలనాలు సృష్టించబోతుందని అర్థమవుతుంది. ఇప్పటివరకూ ఒక్క పాట కూడా రాకుండానే ఈ రేంజులో డీల్ కుదరడం అంటే మామూలు విషయం కాదు.

సికింద్రాబాద్ ప్యారడైజ్ బ్యాక్ డ్రాప్ తో పీరియాడిక్ స్టోరీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇప్పటికే ఈ మూవీకోసం ఓ బస్తీ సెట్ ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆ సెట్ లో రెగ్యులర్ షూట్‌ మొదలు పెట్టుకోనుంది 'ది ప్యారడైజ్'. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'దసరా' చిత్రాన్ని నిర్మించిన ఎల్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి 'ది ప్యారడైజ్'ను నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News