'తండేల్' రన్‌టైమ్‌ పై వచ్చేసిన క్లారిటీ!

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ‘తండేల్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీగా ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు.;

By :  S D R
Update: 2025-01-30 01:11 GMT

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ‘తండేల్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీగా ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

'తండేల్' సినిమా ఫైనల్ రన్‌ టైమ్‌ను 2 గంటల 25 నిమిషాలుగా లాక్ చేసినట్లు దర్శకుడు చందూ మొండేటి వెల్లడించాడు. మొదట ఈ చిత్రం 2 గంటల 45 నిమిషాల నిడివితో సిద్ధమవగా, ఎడిటర్ నవీన్ నూలి కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయడంతో ఫైనల్ గా 2 గంటల 25 నిమిషాల నిడివిని ఖరారు చేశారట. మొత్తంగా షార్ప్ రన్‌టైమ్ తో 'తండేల్' రాబోతుంది. ప్రేమికులరోజు కానుకగా ఒక వారం ముందే ఈ రొమాంటిక్ పేట్రియాటిక్ మూవీ ఫిబ్రవరి 7న విడుదలకు ముస్తాబవుతోంది.

Tags:    

Similar News