రికార్డు స్థాయి స్క్రీన్స్‌ లో ‘వార్ 2’

వార్ 2 దాదాపు 9,000 స్క్రీన్స్‌పై రిలీజ్ కానుంది. ఒకవేళ ఈ ప్లాన్ కార్యరూపం దాల్చితే... ఇది ఇండియన్ సినిమా స్క్రీన్ కౌంట్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది.;

By :  K R K
Update: 2025-07-04 09:13 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్‌తో కలిసి భారీ మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ లో ఫుల్ జోష్‌ తో నటిస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్‌లు సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అన్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. ఆమె తన గ్లామర్, టాలెంట్‌తో సినిమాకి మరింత కిక్ యాడ్ చేస్తోంది. బాలీవుడ్‌లోని టాప్-నాచ్ ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది, డైరెక్షన్ బాధ్యతలు స్టైలిష్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చేపట్టారు.

ఈ బిగ్-బడ్జెట్ బ్లాక్‌బస్టర్ ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఏ రేంజ్‌లో ప్లాన్ చేస్తుందంటే.. భారతీయ సినిమా హిస్టరీలో ఇది ఓ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోంది. సోర్సెస్ ప్రకారం.. వార్ 2 దాదాపు 9,000 స్క్రీన్స్‌పై రిలీజ్ కానుంది. ఒకవేళ ఈ ప్లాన్ కార్యరూపం దాల్చితే... ఇది ఇండియన్ సినిమా స్క్రీన్ కౌంట్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రికార్డ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0 పేరిట ఉంది. ఆ సినిమా 7,500 స్క్రీన్స్‌పై రిలీజ్ అయింది.

ఇప్పుడు ‘వార్ 2’ ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కోసం గ్రాండ్ లెవెల్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత సితార నాగ వంశీ ఏకంగా రూ. 90 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది సినిమాపై ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యాకింగ్, ఎన్టీఆర్-హృతిక్ లాంటి బిగ్ స్టార్స్ కాంబో, కియారా అద్వానీ గ్లామర్ డోస్‌తో ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందో ఊహించడం కష్టం. 

Tags:    

Similar News