‘వార్ 2’ గ్లోబల్ ఐమ్యాక్స్ రిలీజ్ !

‘వార్ 2’ గ్లోబల్ ఐమాక్స్ రిలీజ్‌తో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్‌ను అతిపెద్ద స్క్రీన్‌పై చూడాలని టీమ్ ఫీల్ అవుతోంది, ఎందుకంటే ఈ సినిమా విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయట.;

By :  K R K
Update: 2025-06-27 01:22 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ ఆగస్టు 14, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఇంకా 50 రోజులే మిగిలి ఉండగా.. అప్పుడే కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈ హైప్‌ను మరింత పెంచేందుకు టీమ్ మూడు స్టైలిష్, ఫ్రెష్ పోస్టర్లను డ్రాప్ చేసింది. ఈ పోస్టర్లు ఫ్యాన్స్‌ను ఫుల్ జోష్‌లోకి తీసుకెళ్లాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రతి పోస్టర్‌లో ఒక్కో లీడ్ క్యారెక్టర్ ఇంటెన్స్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తూ ఫైర్ బ్రాండ్ ఎనర్జీని విజువల్స్ ద్వారా పంచుతున్నారు.

ఎన్టీఆర్ లుక్ మామూలుగా లేదు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ ఫుల్ డామినేషన్ మోడ్ ఆన్ చేశాడని అనిపిస్తోంది. ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను డైరెక్ట్ చేస్తున్నది ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ, ప్రొడ్యూస్ చేస్తున్నది బాలీవుడ్ బిగ్ షాట్ ఆదిత్య చోప్రా. ఇంక ‘వార్ 2’ గ్లోబల్ ఐమాక్స్ రిలీజ్‌తో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్‌ను అతిపెద్ద స్క్రీన్‌పై చూడాలని టీమ్ ఫీల్ అవుతోంది, ఎందుకంటే ఈ సినిమా విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయట.

టీజర్ రిలీజ్ అయినప్పుడు కొంతమంది మిక్స్‌డ్ రియాక్షన్స్ ఇచ్చారు, కానీ నిర్మాతలు మాత్రం సూపర్ కాన్ఫిడెంట్. విజువల్‌గా స్టన్నింగ్‌గా, ఎమోషనల్‌గా గ్రిప్పింగ్‌గా ఉండే యాక్షన్ డ్రామాను డెలివర్ చేస్తామని ఫుల్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమాలో హై-ఓక్టేన్ స్టంట్స్ ఒక ఎత్తు అయితే, కియారా అద్వానీ గ్లామర్ మరో ఎత్తు. ఈ కాంబో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇవ్వబోతోంది. ‘వార్ 2’ మూవీఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News