‘వార్ 2’ రన్ టైమ్ ఎంతో తెలుసా?

ఈ సినిమా అధికారికంగా 173 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తోంది. అంటే సరిగ్గా.. 2 గంటల 53 నిమిషాలు.;

By :  K R K
Update: 2025-08-12 07:24 GMT

యంగ్ టైగర్ యన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ యాక్షన్ మూవీ ‘వార్ 2’. ఈ సినిమా ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంక ఈ సినిమా అధికారికంగా 173 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తోంది. అంటే సరిగ్గా.. 2 గంటల 53 నిమిషాలు. కానీ చివరి నిమిషంలో కొన్ని మార్పులతో. సెన్సార్ చేసిన వెర్షన్ నుంచి 6 నిమిషాలకు పైగా కట్ చేసి, సినిమా ఫ్లో టైట్‌గా ఉండేలా.. డ్రామా ఇంటాక్ట్‌గా ఉండేలా చూసుకున్నారు మేకర్స్.

యూ/ఏ 16+ ట్యాగ్‌తో వస్తున్న ఈ సినిమా హై-ఆక్టేన్ యాక్షన్, షార్ప్ డైలాగ్స్, బిగ్-స్క్రీన్ స్పెక్టాకిల్‌ని మిక్స్ చేసి ఆకట్టుకుంటుంది. అయితే రన్‌టైమ్ కంటే కూడా కంటెంట్‌ని రిలీజ్‌కి ముందు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఫుల్ వెర్షన్‌ని ముందుగా లీక్ కాకుండా... ఎగ్జిబిటర్స్‌కి సాఫ్ట్ కాపీ పంపారు. కానీ స్మార్ట్ ట్విస్ట్‌తో. మేజర్ ట్విస్ట్‌లు, టర్నింగ్ పాయింట్స్ రివీల్ కాకుండా ఆ సీన్స్‌ని రిమూవ్ చేసి, థియేటర్ ఓనర్స్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకునేలా చేశారు. అయినా, ఫ్యాన్స్‌కి సినిమాలో సర్‌ప్రైజ్‌లు ఫ్రెష్‌గా ఉంటాయి.

లీక్స్ ట్రైలర్స్ కంటే వేగంగా స్ప్రెడ్ అయ్యే ఈ రోజుల్లో.. ఇది స్మార్ట్ డ్యామేజ్ కంట్రోల్‌కి ఒక రేర్ ఎగ్జాంపుల్. బిగ్-బడ్జెట్ సినిమాలు తరచూ సోషల్ మీడియాలో స్పాయిలర్స్‌కి బలవుతాయి. ఆడియన్స్ ఎక్స్‌పైరిమెంట్‌ని కిల్ చేస్తాయి. ఎగ్జిబిటర్ కాపీల నుంచి సెన్సిటివ్ పార్ట్స్‌ని తీసేయడం ద్వారా.. ‘వార్ 2’ టీమ్ వాళ్లు ఒక అడుగు ముందున్నారని చూపిస్తోంది. మొత్తానికి ‘వార్ 2’ తో భారతీయ ప్రేక్షకులకు మాంచి మాస్ ట్రీట్ ఉండబోతోందన్నమాట.

Tags:    

Similar News