తమన్నా బాలీవుడ్ మూవీ రిలీజ్ అప్పుడే !

చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. “అరణ్యం మురిపించింది... ఆ శక్తి మే 15, 2026న బిగ్ స్క్రీన్‌పై బయటపడబోతోంది! సిద్ధంగా ఉండండి ఈ అద్భుతమైన అడవికథ కోసం..” అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు.;

By :  K R K
Update: 2025-05-16 14:24 GMT

బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా జోడీగా నటిస్తున్న భారీ చిత్రం ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’. ఈ సినిమా తాజాగా విడుదల తేదీని ప్రకటించుకుంది. శుక్రవారం.. చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. “అరణ్యం మురిపించింది... ఆ శక్తి మే 15, 2026న బిగ్ స్క్రీన్‌పై బయటపడబోతోంది! సిద్ధంగా ఉండండి ఈ అద్భుతమైన అడవికథ కోసం..” అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు.

ఈ చిత్రం జానపదకథల నేపథ్యంలో సాగే అనుభూతిని థియేటర్లలో అందించనుంది. మానవతా భావాలతో మేళవిన జానపద థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా జూన్ 2025 నుంచి షూటింగ్ ప్రారం భించనుంది. ఈ చిత్రానికి టీవీఎఫ్ స్థాపకుడు అరుణాభ్ కుమార్ దర్శకత్వం వహించగా.. పంచాయత్ వంటి గొప్ప వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించిన దీపక్ కుమార్ మిశ్రా కో-డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. టీవీ నుంచి పెద్ద తెరపైకి అరుణాభ్ కుమార్ ఈ సినిమాతో అడుగుపెడుతున్నాడు. భారతీయ పురాణాలు, సాంస్కృతిక గాధల నుంచి స్ఫూర్తి పొందిన ఈ కథ, ఒక భిన్నమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించనుందని చిత్రబృందం చెబుతోంది.

గత నెలలో తమన్నా భాటియాను అధికారికంగా ఈ చిత్రానికి స్వాగతిస్తూ, ఆమె పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఆ టీజర్‌లో ఆమె ముఖం కనిపించకపోయినా, ఎరుపు చీరలో అడవిలో నడుచుకుంటూ వెళ్లడం, దీపం వెలిగించడం, “సాయంత్రం తర్వాత అడవిలోకి ప్రవేశించకండి” అనే బోర్డు దగ్గర ఆగడం వంటి మిస్టీరియస్ విజువల్స్ చూపిస్తూ సస్పెన్స్‌ను పెంచారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.


Tags:    

Similar News