‘సితారే జమీన్ పర్’ చిత్రానికి డిపరెంట్ రిలీజ్ స్ట్రాటజీ !

ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వెల్లడయ్యాయి. సినిమా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లకు ఓ లిస్ట్ ఆఫ్ రిక్వైర్‌మెంట్స్ పంపారు. అందులో కొన్ని కీలక షరతులు ఉన్నాయి.;

By :  K R K
Update: 2025-06-18 12:14 GMT

బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ తన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ కోసం ఓ డిఫరెంట్ రిలీజ్ స్ట్రాటజీతో ముందుకొచ్చాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాకి రెండు చిన్న కట్స్‌తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వెల్లడయ్యాయి. సినిమా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లకు ఓ లిస్ట్ ఆఫ్ రిక్వైర్‌మెంట్స్ పంపారు. అందులో కొన్ని కీలక షరతులు ఉన్నాయి.

ముందుగా, ‘సితారే జమీన్ పర్’ సినిమాకి ఉదయం 9 గంటలకు ముందు ఏ షోలూ ఉండకూడదని స్పష్టం చేశారు. అంతేకాదు, థియేటర్లు వీకెండ్‌లలో పాపులర్ ప్రైసింగ్ స్ట్రాటజీని ఫాలో చేయాలని ఆదేశించారు. జనరల్‌గా బిగ్ బడ్జెట్ మూవీస్ బ్లాక్‌బస్టర్ ప్రైసింగ్‌తో వస్తాయి. అంటే టికెట్ రేట్స్ స్కై-హై లెవెల్స్‌లో ఉంటాయి. కానీ.. ఆమిర్ ఖాన్ ఈ రూట్‌కి వెళ్లడం లేదు. బ్లాక్‌బస్టర్ ప్రైసింగ్ వాడితే, చాలా మంది సినిమా లవర్స్‌కి టికెట్స్ అఫర్డ్ చేయడం కష్టమవుతుంది. అందుకే ఆమిర్ ఈ డెసిషన్ తీసుకున్నాడు.. అని సమాచారం.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ‘సితారే జమీన్ పర్’ రిలీజ్ అయితే.. ఆ థియేటర్‌లో ఈ సినిమా షోలు మాత్రమే రన్ అవ్వాలి. వేరే ఏ సినిమాకి చోటు ఉండకూడదు. ఇది ఆమిర్ టీమ్ తీసుకున్న బోల్డ్ డెసిషన్. మల్టీప్లెక్స్‌లకి కూడా స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. రెండు స్క్రీన్‌ల థియేటర్లు రోజుకి 8 షోలు వేయాలి. 3, 4, 5, 6 స్క్రీన్‌ల మల్టీప్లెక్స్‌లు వరుసగా 11, 14, 16, 19 షోలు రన్ చేయాలి. 7 స్క్రీన్‌ల మల్టీప్లెక్స్‌లలో 22 షోలు, 8 స్క్రీన్‌లవాటిలో 25 షోలు తప్పనిసరి. 9 స్క్రీన్‌ల థియేటర్లలో 28 షోలు, 10 లేదా అంతకంటే ఎక్కువ స్క్రీన్‌ల మల్టీప్లెక్స్‌లలో రోజుకి 31 షోలు ప్లే అవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు కండిషన్ పెట్టారు. ఈ స్క్రీన్ డామినేషన్ స్ట్రాటజీతో ఆమిర్ సినిమా మార్కెట్‌లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు.

‘సితారే జమీన్ పర్’ 2007లో రిలీజైన ఐకానిక్ మూవీ ‘తారే జమీన్ పర్’ చిత్రానికి స్పిరిచ్యువల్ సీక్వెల్‌గా రూపొందింది. ఈ సినిమా 2018లో వచ్చిన స్పానిష్ ఫిల్మ్ ‘చాంపియన్స్’ కు రీమేక్. ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్‌లో కనిపించనున్నాడు, అలాగే జెనీలియా డిసౌజా కీలక పాత్రలో నటిస్తోంది.

Tags:    

Similar News