ఈ కాంబో గానీ సెట్ అయితే .. పూనకాలే !

తాజా సమాచారం ప్రకారం.. షారుఖ్ ఖాన్, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.;

By :  K R K
Update: 2025-03-18 01:14 GMT

సౌత్ అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీస్ మధ్య గల అంతరాన్ని తగ్గించే ప్రయత్నాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో.. రెండు పరిశ్రమల మధ్య అండర్ స్టాండింగ్స్ కొత్త నార్మ్‌గా మారుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘కబీర్ సింగ్, యానిమల్’ భారీ హిట్ అవ్వగా.. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే జోరులో మరో ఆసక్తికరమైన వార్త సినీ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబో గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. షారుఖ్ ఖాన్, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది 1994లో విడుదలైన షారుఖ్‌ క్రేజీ సైకో థ్రిల్లర్ "అంజామ్" తరహాలో ఉంటుందని చెబుతున్నారు. అంటే, బాలీవుడ్ కింగ్ ఖాన్ మళ్లీ యాంటీ హీరో పాత్రలో దర్శనమిస్తాడని అంచనాలు ఉన్నాయి.

ఇంతకుముందు ‘బాజీగర్, దర్, డాన్’ లాంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించిన షారుఖ్.. ఈ సినిమాతో మరోసారి తన ఇన్సేన్ పెర్ఫార్మెన్స్‌ను చూపించబోతున్నాడని భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ ఏకంగా రూ. 1800 కోట్లు గ్రాస్ వసూలు చేయగా.. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ గ్లోబల్ మార్కెట్ ఉన్న స్టార్ కావడంతో ఈ చిత్రం బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాకుండా చైనా, యుకే, యుఎస్ వంటి దేశాల్లోనూ కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ, ఇది నిజమైతే మాత్రం భారతీయ సినీ పరిశ్రమలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ సునామీ సృష్టించే భారీ ప్రాజెక్ట్ అవ్వడం ఖాయం!


Tags:    

Similar News