రిపీట్ కాంబో... మరో అదిరిపోయే చిత్రం !
తన తదుపరి ప్రాజెక్ట్ గురించి స్వయంగా అప్‌డేట్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్ . సిద్థార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘కింగ్’ అనే చిత్రంతో త్వరలో రానున్నట్లు వెల్లడించాడు.;
2023లో ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ వంటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్. కానీ లాస్టియర్ షారుఖ్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి స్వయంగా అప్‌డేట్ ఇచ్చాడు. సిద్థార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘కింగ్’ అనే చిత్రంతో త్వరలో రానున్నట్లు వెల్లడించాడు. సిద్థార్థ్ ఆనంద్, షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘పఠాన్’ చిత్రం ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో తెలిసిందే.
ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ‘కింగ్’ అనే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. మరో రెండు నెలలు షెడ్యూల్ ఉంటుంది. మా దర్శకుడు సిద్థార్థ్ ఆనంద్ చాలా స్ట్రిక్ట్. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను బయటకు చెప్పొద్దని ఆయన చెప్పారు. కానీ, ఒకటి మాత్రం హామీ ఇస్తున్నాను.. ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులు, అభిమానులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. షారుక్ ఖాన్.. ఈ సారి నిజంగానే ‘కింగ్’గా కనిపించనున్నాడు. మా టీమ్ చాలా కష్టపడుతోంది, అందరూ గర్వపడే సినిమా ఇది’’ అని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి కథ కోసం ఎనిమిదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. యాక్షన్ సన్నివేశాల్లో నటించడం అంత సులభం కాదు. చాలా సాధన చేయాలి. ఎన్నో నేర్చుకోవాలి. కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ డూపులతో చేయించవచ్చు. అయితే.. ఫైట్ సీక్వెన్స్‌ల్లో 80 శాతం మనం చేయాల్సిందే. లేనిపక్షంలో సహజత్వం కనిపించదు’’. అని షారుక్ తన అనుభవాలను పంచుకున్నాడు. షారుక్ ఖాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.