మరోసారి ప్రేమ్ గా అలరించబోతున్న సల్మాన్ ఖాన్ !
ఇప్పటి వయసుకు తగినట్లు ప్రేమ్ పాత్రలో కొన్ని మార్పులు చేస్తున్నాం. ఈసారి మరింత మెచ్యూరిటీ కలిగిన కథనంతో.. ఎమోషన్స్ ఉండేలా రూపొందిస్తాను” అని చెప్పారు.;
సల్మాన్ ఖాన్‌ను ఇండియన్ తెరపై ప్రేమ్ అనే పాత్రతో చిరస్మరణీయుడిగా మార్చిన ప్రసిద్ధ దర్శకుడు సూరజ్ బర్జాత్యా. సల్మాన్ ఖాన్‌కు ప్రత్యేకమైన అభిమానులను తీసుకువచ్చిన ప్రేమ్ పాత్ర.. ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం పొందింది. తాజాగా సూరజ్ బర్జాత్యా ఒక ఇంటర్వ్యూలో సల్మాన్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి వివరించారు.
సూరజ్ మాట్లాడుతూ.. “ఇది పూర్తి స్థాయిలో కొత్త కోణంలో ఉంటూ.. ఇప్పటి వయసుకు తగినట్లు ప్రేమ్ పాత్రలో కొన్ని మార్పులు చేస్తున్నాం. ఈసారి మరింత మెచ్యూరిటీ కలిగిన కథనంతో.. కుటుంబ విలువలు, వినోదం, ఎమోషన్స్ ఉండేలా రూపొందిస్తాను” అని చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేయడానికి కొంచెం సమయం తీసుకుంటుందని సూరజ్ బర్జాత్యా వెల్లడించారు.
1989లో ‘మైనే ప్యార్ కియా’ సినిమా ద్వారా సల్మాన్‌ను ప్రేమ్ అనే ప్రేమికుడి పాత్రలో ప్రేక్షకులకు పరిచయం చేసిన సూరజ్ బర్జాత్యా.. ఆ తర్వాత ‘హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్-సాథ్ హైన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మరింత గుర్తింపు పొందారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ సినిమాలో నటిస్తు్న్న సల్మాన్ ఖాన్ .. మరికొన్ని చిత్రాల్ని లైన్ లో పెట్టాడు. అయితే సూరజ్ భరజాత్య డైరెక్టోరియల్ మూవీని మాత్రం ప్రయారిటీ లిస్ట్ లో పెట్టాడు. మరి ఈ సారి ప్రేమ్ గా సల్మాన్ ను సూరజ్ ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో చూడాలి.