మరో బ్లాక్ బస్టర్ కోసం రష్మిక వెయిటింగ్ !
‘యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించిన రష్మిక మందన్నా... "సికందర్" హిట్ అయితే.. బాలీవుడ్‌లో ఆమె స్థానం మరింత బలపడనుంది.;
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ మూవీ "సికందర్" తో.. భారీ కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. బ్లాక్‌బస్టర్ మూవీ "గజినీ" దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో.. అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సల్మాన్ ఇప్పటివరకు ఎవరూ చూడని ఓ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమా వెండితెరపై ఓ గొప్ప అనుభూతిని అందించ నుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమా మార్చి 30న ఈద్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. గతంలో ఎన్నోసార్లు ఈద్‌కు తన సినిమాలను విడుదల చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సల్మాన్.. ఈసారి కూడా అదే మేజిక్ రిపీట్ చేయనున్నాడని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఇది ఆమె తొలి చిత్రమైనప్పటికీ.. ఈ జంట తెరపై పండించే కెమిస్ట్రీ.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఇప్పటికే ‘యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించింది రష్మిక మందన్నా. "సికందర్" కూడా సూపర్ హిట్ అయితే.. బాలీవుడ్‌లో ఆమె స్థానం మరింత బలపడనుంది. వరుస హిట్లతో బిజీగా ఉన్న రష్మిక.. ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసించనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.