హృతిక్ రోషన్ కు జోడీగా రష్మిక మందన్న?

హృతిక్ రోషన్ ప్రతిష్టాత్మక సూపర్ హీరో చిత్రం 'క్రిష్ 4' లో కథానాయికగా రష్మిక మందన్న దాదాపు ఖరారైనట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.;

By :  K R K
Update: 2025-09-20 04:40 GMT

'గుడ్ బై', 'మిషన్ మజ్ను' వంటి బాలీవుడ్ సినిమాలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రష్మికా మందన్న.. 'పుష్ప' ఫ్రాంఛైజీ, 'యానిమల్', 'ఛావా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో 'నేషనల్ క్రష్' గా మారింది. అయితే, సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ.. అది రష్మిక పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి ఆటంకం కలిగించలేదు.

ప్రస్తుతం రష్మిక చేతిలో దాదాపు డజను సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. 'యానిమల్ పార్క్', అల్లు అర్జున్-దీపికా పదుకొణె నటిస్తున్న అట్లీ డైరెక్టోరియల్ మూవీ, 'పుష్ప 3', 'థామ' వంటివి వాటిలో కొన్ని. తాజా సమాచారం ప్రకారం, హృతిక్ రోషన్ ప్రతిష్టాత్మక సూపర్ హీరో చిత్రం 'క్రిష్ 4' లో కథానాయికగా రష్మిక మందన్న దాదాపు ఖరారైనట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

'క్రిష్ 4' సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో యాక్షన్ ఫ్రాంచైజీలో నాలుగో భాగం. మొదటి మూడు భాగాలు- 'కోయి మిల్ గయా', 'క్రిష్', 'క్రిష్ 3' లకు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. అయితే, నాలుగో భాగంతో హృతిక్ రోషన్ దర్శకుడిగా మారబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది.

Tags:    

Similar News