ఊర్వశి రౌతేలాకు సమన్లు జారీ చేసిన ఈడీ
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో ఊర్వశి రౌతేలా పాల్గొన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆమెను ప్రశ్నించనుంది. ఆమె సెప్టెంబర్ 16న తమ ముందు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది.;
ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిగిన మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు సమన్లు జారీ చేసింది. పలువురు ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో ఊర్వశి రౌతేలా పాల్గొన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆమెను ప్రశ్నించనుంది. ఆమె సెప్టెంబర్ 16న తమ ముందు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు, క్రీడాకారులు కూడా విచారణకు హాజరయ్యారు.
ఈడీ గతంలో కూడా ఆన్‌లైన్ బెట్టింగ్, మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులను విచారించింది. వారిలో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి వంటివారు ఉన్నారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై వివరాలను సేకరించేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది.
ఊర్వశి రౌతేలా ప్రధానంగా బాలీవుడ్ సినిమాల్లో నటిగా పేరుపొందింది. అయితే తెలుగు సినిమాల్లోనూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 'డాకూ మహారాజ్', 'వాల్తేరు వీరయ్య', 'స్కంద', 'ఏజెంట్' వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయింది.