ఆస్కార్ ఎంట్రీకి జాన్వీ కపూర్ చిత్రం
కేన్స్ 2025లో ప్రతిష్ఠాత్మకమైన అన్ సర్టైన్ రిగార్డ్ విభాగంలో ప్రీమియర్ అయిన ఈ చిత్రం, తొమ్మిది నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది.;
డైరెక్టర్ నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో రూపొందిన “హోమ్‌బౌండ్” చిత్రం ఆస్కార్ 2026 కు భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెఠ్వా కీలక పాత్రల్లో నటించారు. “హోమ్‌బౌండ్” ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో గుర్తింపు పొందింది.
కేన్స్ 2025లో ప్రతిష్ఠాత్మకమైన అన్ సర్టైన్ రిగార్డ్ విభాగంలో ప్రీమియర్ అయిన ఈ చిత్రం, తొమ్మిది నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. ధర్మా ప్రొడక్షన్స్ సమర్పణలో వచ్చిన ఈ సినిమా, భారతదేశంలో కులం, మతపరమైన వివక్షలను ఇద్దరు స్నేహితుల వ్యక్తిగత పోరాటాలు, సామాజిక మూఢనమ్మకాల ద్వారా చూపిస్తుంది.
ఈ చిత్రం జాన్వీ కపూర్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది. “హోమ్‌బౌండ్” ఆస్కార్ ఫైనల్ షార్ట్‌లిస్ట్‌లో చోటు సంపాదిస్తే.. ఆమెకు తొలి అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశం ఉంది.