ఇక రష్మిక బాలీవుడ్ లోనే

Update: 2025-03-10 08:02 GMT

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం "ఛావా" భారీ విజయం సాధించింది. ఈ సినిమా భారతదేశంలో ₹500 కోట్లను దాటి రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. తెలుగు వెర్షన్ కూడా గత శుక్రవారం విడుదలై తొలి వీకెండ్‌లోనే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది.




ఈ ఘనతతో రష్మిక మందన్నా ఇటీవల భారతదేశంలో మూడు హిందీ సినిమాలు రూ. 500 కోట్లను దాటించిన ఏకైక నాయికగా నిలిచింది. ఈ జాబితాలో "పుష్ప 2" (హిందీ వెర్షన్‌కి ₹800 కోట్లు), "యానిమల్" (₹555 కోట్లు) మరియు ఇప్పుడు "ఛావా" (₹500 కోట్లు) ఉన్నాయి. రష్మిక నటనలో కనిపించే వైవిధ్యం, సహజమైన హావభావాలు, ప్రేక్షకులను ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెను భారతదేశంలో అత్యంత విజయవంతమైన నాయికగా నిలిపాయి.




 చత్రపతి శివాజీ మహారాజ్, ఆయన తనయుడు శంభాజీ మహారాజ్ చుట్టూ తిరిగే ఈ చారిత్రక కథ ప్రజల మనసులను దోచుకుంది. దేశభక్తి, చరిత్ర, గౌరవం వంటి అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ విజయాలతో రష్మిక మందన్నా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు, హిందీ చిత్రసీమలో కూడా అగ్రతారగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మరిన్ని భారీ ప్రాజెక్టులతో ఆమె తన స్టార్‌డమ్‌ను ఇంకా పెంచనుంది.


లోనై 


Tags:    

Similar News