లంక సీన్స్ తో ప్రారంభం కానున్న షూటింగ్

తొలివిడత చిత్రీకరణలో లంక నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలు, యష్ సోల్ గా చేసే కీలక సన్నివేశాలు ఉండనున్నాయి.;

By :  K R K
Update: 2025-01-31 12:45 GMT

నితేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న "రామాయణం" బాలీవుడ్ చిత్రం సినీ ప్రేమికులలో విశేషమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ గ్రాండ్ ప్రాజెక్టులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ యష్ రావణుడిగా అద్భుతమైన పాత్ర పోషించనున్నాడు. విశేషమేంటంటే, యష్ ఈ చిత్రానికి సహ-నిర్మాతగానూ వ్యవహరించనున్నాడు. అతడు నామిత్ మల్హోత్రాతో కలిసి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

యష్ పాత్ర చిత్రీకరణ వచ్చే మార్చి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తొలివిడత చిత్రీకరణలో లంక నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలు, యష్ సోల్ గా చేసే కీలక సన్నివేశాలు ఉండనున్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుండగా, మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.

సినిమా గురించి నిర్మాత నామిత్ మల్హోత్రా మాట్లాడుతూ, "ఈ ప్రతిష్టాత్మక కథను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించి, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.." అని తెలిపారు. యష్ తన పాత్రపై గొప్ప ఉత్సాహం వ్యక్తం చేస్తూ, "రావణుని పాత్రలో అపారమైన లోతు, విభిన్న కోణాలు ఉన్నాయి. నా కెరీర్‌లో ఇంత గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది," అని పేర్కొన్నాడు. ఇక యష్ మరో ఆసక్తికరమైన చిత్రం "టాక్సిక్"లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గీతూ మోహందాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Tags:    

Similar News