‘క్రిష్ 4’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గ్లోబల్ క్వీన్ !

ఈ చిత్రంలో గ్లోబల్ క్లీన్ ప్రియాంకా చోప్రా మళ్లీ ‘ప్రియా’ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హృతిక్, ప్రియాంకా జోడీకి ఇప్పటికే విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఉంది.;

By :  K R K
Update: 2025-04-12 01:06 GMT

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సూపర్‌హీరో ఫిల్మ్ ‘క్రిష్ 4’. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓ కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసిన రాకేష్ రోషన్ నుంచి ఆయన తనయుడు హృతిక్ రోషన్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాతో కలిసి రోషన్ కుటుంబం పని చేస్తోంది. గ్లోబల్ లెవల్‌కు పోటిగా నిలిచే విధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నా.. కథాంశం మాత్రం భారతీయతకు దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు.

ఈ క్రేజీ కాంబినేషన్ ప్రకటించిన నాటి నుండి నటీనటుల ఎంపికపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో గ్లోబల్ క్లీన్ ప్రియాంకా చోప్రా మళ్లీ ‘ప్రియా’ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హృతిక్, ప్రియాంకా జోడీకి ఇప్పటికే విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. కాబట్టి ప్రియాంకా చోప్రా ఈ చిత్రానికి ఓకే చెప్పడం పెద్ద విషయంగా భావించాల్సిన అవసరం లేదు. ‘కోయి మిల్ గయా’ నుంచి మొదలైన ఈ ప్రయాణం ‘క్రిష్’, ‘క్రిష్ 3’ వరకు కొనసాగింది. ఇప్పుడు ‘క్రిష్ 4’ లోనూ ఇద్దరి జోడీ కొనసాగనుంది. హృతిక్ విజన్ ఆమెను ఆకట్టుకోవడంతో పాటు, అతడు దర్శకుడిగా మారిన ఈ ప్రయోగం ఆమెకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందట.

ఈ చిత్రం 2026 లో సెట్స్ పైకి వెళ్లనుంది. నటీనటుల ఎంపిక ఇంకా జరుగుతోంది. 23 సంవత్సరాల తర్వాత జాదూ అనే పాపులర్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలోకి తిరిగి రానుంది. ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులకు ఇప్పటివరకు లేని స్థాయిలో విజువల్, ఎమోషనల్ అనుభూతిని ఇవ్వనుందని టీం విశ్వాసంగా ఉంది. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. 

Tags:    

Similar News