హాలీవుడ్ డార్క్ కామెడీ చిత్రంలో గ్లోబల్ క్వీన్ !

ప్రముఖ దర్శకుడు నికోలస్ స్టోలర్ దర్శకత్వంలో రూపొందుతున్న అమేజాన్ ఎంజీఎం స్టూడియోస్ సినిమా కోసం అధికారికంగా టీం అయింది.;

By :  K R K
Update: 2025-04-16 02:28 GMT

గ్లోబల్ క్వీన్ ప్రియాంకా చోప్రా .. తన హాలీవుడ్ ప్రయాణాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తోంది. తాజాగా ఆమె ప్రముఖ దర్శకుడు నికోలస్ స్టోలర్ దర్శకత్వంలో రూపొందుతున్న అమేజాన్ ఎంజీఎం స్టూడియోస్ సినిమా కోసం అధికారికంగా టీం అయింది. ఈ కామెడీ చిత్రంలో మైకేల్ పెనా, విల్ ఫెరెల్, జాక్ ఎఫ్రాన్, రెజీనా హాల్, జిమ్మీ టాట్రో, బిల్లీ ఐచ్నర్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

ప్రియాంకా ఈ వార్తను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. క్యాస్టింగ్ అనౌన్స్‌మెంట్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానుల కోసం ఇది ఒక సంతోషకరమైన అప్‌డేట్‌గా మారింది. ఈ సినిమాకు “జడ్జ్‌మెంట్ డే” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కథ ప్రకారం, జాక్ ఎఫ్రాన్ పోషించే ఒక యువ ఖైదీ జైలు నుండి బయటకు వచ్చాక.. తన జీవితాన్ని నాశనం చేసేలా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై (విల్ ఫెరెల్) కసిగా ఉంటాడు. ఆ కోపంతో అతడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే మిగతా కథ. ఈ నేపథ్యంలో జరిగే సంఘటనలు డార్క్ హ్యూమర్ ఉత్కంఠభరిత నాటకీయతను కలగలిపి చూపనున్నాయి.

ఈ చిత్రానికి బలమైన నిర్మాణ బృందం ఉంది. విల్ ఫెరెల్, జెసికా ఎల్బామ్, అలెక్స్ బ్రౌన్ గ్లోరియా సాంచెజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. "ఫర్గెటింగ్ సారా మార్షల్", "నెయిబర్స్" వంటి హిట్ చిత్రాలకు దర్శకుడైన నికోలస్ స్టోలర్ తన స్వంత సంస్థ స్టోలర్ గ్లోబల్ సొల్యూషన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నారు. ప్రియాంకా పాత్రపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు కానీ, ఆమె పాత్రపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News