‘యూధ్రా’ హీరోతో ప్రకాశ్ ఝా పొలిటికల్ డ్రామా !
ఈ చిత్రం బీహార్ రాజకీయ నేపథ్యంతో.. ఆ ప్రాంతంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది.;
‘గల్లీ బాయ్’ మూవీతో బాలీవుడ్ లో తన సినీ ప్రయాణాన్ని గ్రాండ్ గా ప్రారంభించాడు యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది. 2019లో.. జోయా అక్తర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అలియా భట్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ‘గెహ్రైయాన్, బంటి ఔర్ బబ్లీ 2, ఫోన్ భూత్, యుధ్రా’ చిత్రాలతో తన నటనను కొనసాగించాడు. అయితే, తన కథల సెలెక్షన్ పై రివ్యూ చేసేందుకు కొంత గ్యాప్ తీసుకున్న సిద్ధాంత్... తాజాగా ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం.
‘ఆశ్రమ’ వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ సాధించిన దర్శకుడు ప్రకాష్ ఝా, ఇప్పుడు భారీ స్థాయిలో ఒక రాజకీయ నేపథ్య చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. గతేడాది నుంచి ఆయన ఒక ప్రాముఖ్యత కలిగిన పొలిటికల్ డ్రామా కథను డవలప్ చేస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్ర పోషించగల నటుడి కోసం వెతుకుతుండగా... సిద్ధాంత్ చతుర్వేది పేరును పరిగణనలోకి తీసుకున్నాడు. ఈ పాత్రలో మల్టిపుల్ లేయర్స్ ఉండడం వల్ల.... బెస్ట్ పెర్ఫార్మర్ కోసం ఆయన వెతుకుతున్నాడు.. అని తెలుస్తోంది.
ఈ చిత్రం బీహార్ రాజకీయ నేపథ్యంతో.. ఆ ప్రాంతంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. రాజకీయ కుట్రలు, ఇంటర్ క్యారెక్టర్ డైనమిక్స్ కలిగిన ఈ కథలో నిజమైన పాత్రల స్వరూపాల్ని సమర్ధంగా ఆవిష్కరించనున్నారు. "అగ్రిమెంట్ అధికారికంగా పూర్తయిన వెంటనే.. సిద్ధాంత్ పాత్ర కోసం ప్రత్యేకంగా డైలెక్ట్, బాడీ లాంగ్వేజ్ వర్క్‌షాప్‌లను అటెండ్ చేయనున్నారు.
ప్రకాశ్ ఝా ‘మృత్యుదండ్, గంగాజల్, రాజనీతి, సత్యాగ్రహ’ వంటి గంభీర రాజకీయ, సామాజిక నేపథ్య సినిమాలను తెరకెక్కించిన ప్రతిభావంతుడైన దర్శకుడు. ఈ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాలో.. సిద్ధాంత్ చతుర్వేది ప్రాముఖ్యమైన పాత్ర పోషించనున్నాడు. ఈ వేసవి నాటికి ఇతర నటీనటుల ఎంపిక పూర్తవుతుందని సమాచారం.