ఆస్కార్ 2025: గ్లోబల్ టాలెంట్‌కు గౌరవం!

Update: 2025-03-03 12:25 GMT

ప్రపంచ సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూసిన 97వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అత్యంత గ్రాండ్‌గా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ హోస్ట్‌గా వ్యవహరించగా, ప్రపంచవ్యాప్తంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈసారి ఆస్కార్ వేడుకలో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకోగా, కొన్ని అనూహ్యమైన ఫలితాలు కూడా వెలువడ్డాయి.

ఈ ఏడాది ఆస్కార్ అవార్డులు ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని అందించాయి. అనేక అద్భుతమైన సినిమాలు, టాలెంట్‌కు గుర్తింపుగా అందించిన అవార్డులు సినీ పరిశ్రమలో మరిన్ని స్ఫూర్తిదాయకమైన సినిమాలను తీసుకురావడానికి ప్రోత్సహించాయి.

విజేతల తుది జాబితా:

ఉత్తమ చిత్రం: అనోరా

ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా)

ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ (ద్రి బ్రూటలిస్ట్)

ఉత్తమ నటి: మైకీ మాడిసన్ (అనోరా)

ఉత్తమ సహాయ నటుడు: కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)

ఉత్తమ సహాయ నటి: జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: అనోరా (సీన్ బేకర్)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాఘన్)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్: పార్ట్ 2

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లో

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్

ఉత్తమ మేకప్ & హెయిర్ స్టైలింగ్: ది సబ్‌స్టెన్స్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: వికెడ్ (పౌల్ టాజెవెల్)

Tags:    

Similar News