‘వార్ 2’ కోసం రచ్చ చేయబోతున్న యంగ్ టైగర్
ఎన్టీఆర్ తన బాలీవుడ్ ఎంట్రీ అయిన "వార్ 2" లో షర్ట్ లేకుండా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సన్నివేశాన్ని ఇప్పటికే చిత్రీకరించారని సమాచారం.;
తన ఫిట్‌నెస్ జర్నీని కొన్ని సంవత్సరాల క్రితమే విజయవంతంగా పూర్తి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇటీవల కాలంలో కూడా తన శరీరాన్ని బలంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అతడి పెర్ఫెక్ట్ ఫిజిక్‌ను రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "ఆర్ఆర్ఆర్"లో స్పష్టంగా చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయమేమిటంటే.. ఎన్టీఆర్ తన బాలీవుడ్ ఎంట్రీ అయిన "వార్ 2" లో షర్ట్ లేకుండా కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఆల్రెడీ ఈ సన్నివేశాన్ని ఇప్పటికే చిత్రీకరించారని సమాచారం. మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... ఈ యాక్షన్ సీన్ సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు తెరపై నిలబడబోతుందట. అంటే షర్ట్ లేకుండా ఎన్టీఆర్ యాక్షన్ చేసేటపుడు ఆ మాస్ విజువల్‌ను కంటిన్యూగా చాలా సేపు చూసే అవకాశం అభిమానులకు లభించబోతోందన్నమాట.
ఈ విధమైన భారీ మాస్ సీన్‌ను చిత్రం దర్శకుడు అయాన్ ముఖర్జీ తన క్రియేటివ్ థాట్స్ తో జోడించడం నిజంగా ఆశ్చర్యకరం. ఇది ఖచ్చితంగా నందమూరి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ స్క్రీన్‌పై ఇలా ఓ మాస్ యాంగిల్‌లో దంచికొడితే థియేటర్లు మోత మోగాల్సిందే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రధారి అయిన హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ షర్ట్ లేకుండా యాక్షన్ సీన్ చేస్తారా అన్నది కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇద్దరూ షర్ట్ లేకుండా యాక్షన్ బ్లాక్‌లో ఎదురెదురుగా వస్తే, థియేటర్లు ఏ స్థాయిలో పులకించిపోతాయో ఊహించుకోవచ్చు.