ఓటీటీలోకి ‘మిషన్ ఇంపాజిబుల్ 8’

ఈ సినిమా ఇప్పుడు న్యూజిలాండ్, అమెరికాలో ఆగస్టు 19 నుంచి, అంటే నేటి నుంచి ఇంటి నుండే చూసేందుకు అందుబాటులో ఉంది. అయితే, భారతీయ ప్రేక్షకులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.;

By :  K R K
Update: 2025-08-19 01:17 GMT

టామ్ క్రూయిజ్ నటించిన హాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘మిషన్ ఇంపాసిబుల్ : ది ఫైనల్ రెకనింగ్’ (మిషన్ ఇంపాసిబుల్ 8) మళ్లీ వార్తల్లో నిలిచింది. క్రిస్టోఫర్ మెక్వారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇండియాలో గ్లోబల్ థియేట్రికల్ రిలీజ్ కంటే వారం ముందే విడుదలై బాక్సాఫీస్ వద్ద బలమైన కలెక్షన్లను రాబట్టింది.

ఈ సినిమా ఇప్పుడు న్యూజిలాండ్, అమెరికాలో ఆగస్టు 19 నుంచి, అంటే నేటి నుంచి ఇంటి నుండే చూసేందుకు అందుబాటులో ఉంది. అయితే, భారతీయ ప్రేక్షకులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ+, ఫాండాంగోలో మాత్రమే అందుబాటులో ఉంది. న్యూజిలాండ్ ప్రాంతంలో ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.

ఇండియాలో ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ ఆధారితంగా ప్రీమియర్ కానుంది. ఈ చిత్రంలో హేలీ ఆట్వెల్, వింగ్ రామ్స్, సైమన్ పెగ్, హెన్రీ జెర్నీ, ఆంజెలా బాసెట్, మరియు ఎసై మోరల్స్ కీలక పాత్రల్లో నటించారు. టామ్ క్రూయిజ్, క్రిస్టోఫర్ మెక్వారీ ఈ సినిమాను సహనిర్మాతలుగా వ్యవహరించగా.. మాక్స్ అరుజ్, ఆల్ఫీ గాడ్‌ఫ్రే సంగీతాన్ని అందించారు.

Tags:    

Similar News