‘బ్రహ్మాస్త్ర 2’ గురించి తాజా అప్డేట్ వచ్చేసింది !

Update: 2025-03-14 07:17 GMT

రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి దాని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర రెండో భాగం గురించి కీలక ప్రకటన చేశాడు. ఆలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె రణబీర్‌తో కలిసి మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యింది.

ఈ సందర్భంగా రణబీర్ మాట్లాడుతూ, "బ్రహ్మాస్త్ర 2 గురించి అయాన్ ముఖర్జీ చాలా కాలంగా కలలు కంటున్నాడు. ఇప్పుడు ఆయన వార్ 2పై పనిచేస్తున్నాడు. ఆ సినిమా విడుదలైన తర్వాత వెంటనే బ్రహ్మాస్త్ర 2 ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా అధికారిక ప్రకటనలు చాలా వరకు చేయలేదు, కానీ త్వరలోనే ఆసక్తికరమైన అప్‌డేట్స్ వస్తాయి," అని వెల్లడించాడు. ఇప్పటికే 2023లో అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 మరియు బ్రహ్మాస్త్ర 3 విడుదల తేదీలను ప్రకటించాడు. రెండో భాగం 2026 డిసెంబర్‌లో విడుదల అవ్వనుండగా.. మూడో భాగం 2007లో రాబోతుంది.

‘బ్రహ్మాస్త్ర’ మొదటి భాగంలో ... వారణాసి ఎపిసోడ్, హిమాలయాల్లో జరిగిన క్లైమాక్స్.. ఇలా ప్రతీ సీన్ చూస్తుంటే మంత్రముగ్ధులమైపోయారు జనం. స్పెషల్ ఎఫెక్ట్స్ అత్యంత ఉన్నతంగా ఉన్నాయి. శివ తన అగ్ని శక్తిని ఎలా నియంత్రించాలో నేర్చుకునే శిక్షణ ఘట్టం అద్భుతంగా నిలిచింది. చివరి ఘట్టం మరొక లోకంలో ఉన్నట్లు అనిపించేలా ఉంటుంది. ప్రతీ సన్నివేశాన్ని అత్యంత జాగ్రత్తగా డిజైన్ చేశారు. భవిష్యత్తులో భారతీయ ఫాంటసీ సినిమాలకు ఇది ఒక గోల్డ్ స్టాండర్డ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. మరి బ్రహ్మాస్త్ర రెండో భాగం ఎలా ఉండబోతోందో చూడాలి.

Tags:    

Similar News