క్రేజీ క్విజ్ షో కేబీసీ కి 25 ఏళ్లు పూర్తి !

ఈ అద్భుతమైన క్విజ్ ప్రోగ్రామ్ కు 25 ఏళ్లు పూర్తయ్యాయని ఈ పోగ్రామ్ టీమ్ వచ్చి చెప్పింది. ఇదీ.. కేబీసీ జీవన ప్రయాణం..." అని ఈ లెజెండరీ నటుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.;

By :  K R K
Update: 2025-07-05 04:31 GMT

ప్రముఖ క్విజ్ షో "కౌన్ బనేగా కరోడ్‌పతి" హోస్ట్‌గా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ . "ఈ రోజు కేబీసీ కొత్త సీజన్ కోసం ప్రిపేర్ అవుతుంటే.. నేటితో ఈ అద్భుతమైన క్విజ్ ప్రోగ్రామ్ కు 25 ఏళ్లు పూర్తయ్యాయని ఈ పోగ్రామ్ టీమ్ వచ్చి చెప్పింది. ఇదీ.. కేబీసీ జీవన ప్రయాణం..." అని ఈ లెజెండరీ నటుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో.. సోనీలివ్ కేబీసీ 17వ సీజన్‌ కోసం.. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా తిరిగి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో, స్ట్రీమర్ ఓ ప్రోమో వీడియో విడుదల చేసింది. అందులో అమితాబ్ కడుపు నొప్పితో రోగిగా కనిపిస్తూ షో కోసం రిజిస్ట్రేషన్లు ఓపెన్ అని ప్రకటించారు. ‘కౌన్ బనేగా కరోర్ పతి 17’ టెలీకాస్ట్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కానీ ఇది ఆగస్టులో ప్రసారం కానుందని సమాచారం.

అమితాబ్ బచ్చన్ కేబీసీ క్విజ్ ప్రోగ్రామ్ తో తన టీవీ డెబ్యూ చేశారు. ఆయన హోస్టింగ్ స్టైల్, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం షోను తక్షణ హిట్‌గా మార్చాయి. భారతీయ టెలివిషన్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ఆయన ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అమితాబ్ కెరీర్‌కు కొత్త ఊపిరి పోశాయి. 2007లో మూడవ సీజన్‌లో తప్ప, అన్ని సీజన్‌లకు అతనే హోస్ట్‌గా ఉన్నారు. ఆ సీజన్‌లో షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించారు.

ఎందుకంటే అమితాబ్ స్టార్ ప్లస్ ఆఫర్‌ను తిరస్కరించారని అప్పట్లో వార్తలొచ్చాయి. షారుఖ్ ఖాన్ కు ప్రజాదరణ ఉన్నప్పటికీ, హోస్ట్ మార్పు వల్ల కేబీసీ రేటింగ్స్ గణనీయంగా పడిపోయాయి. దాంతో అమితాబ్ నే తిరిగి హోస్ట్ గా తీసుకున్నారు. మళ్లీ అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అమితాబ్ నే ఈ షో కు హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు.


Tags:    

Similar News