కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జోడీగా మరో సినిమా !
అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్, దర్శకుడు సమీర్ విద్యాన్స్ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
బాలీవుడ్‌లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారిన సినిమా 'తూ మేరీ మైం తేరా, మైం తేరా తూ మేరీ'. కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహార్ కలయికలో 2026లో రాబోయే ఈ రొమాంటిక్ ఫిల్మ్‌పై సినీ ప్రియులలో ఆసక్తి పెరిగిపోతోంది. తాజాగా ఈ చిత్రంలో కథానాయికగా అనన్య పాండే ఖరారైనట్టు తెలుస్తోంది. ఇటీవల అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్, దర్శకుడు సమీర్ విద్యాన్స్ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ముగ్గురూ ఓ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న ఫోటోలు కూడా అభిమానులలో ఆసక్తిని పెంచాయి. దాంతో అనన్య ఫైనల్ అనే నిర్ధారణకు వస్తున్నారు.
నిజానికి ముందుగా ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ పేరును పరిశీలించినట్టు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తర్వాత అనన్య పాండే, శర్వరి మధ్య ఎంపిక జరిగిందని... ఫైనల్ గా అనన్యకు ఆ అవకాశం దక్కినట్టు సమాచారం. 2019లో వచ్చిన 'పతి, పత్నీ ఔర్ వో' లో కార్తిక్, అనన్య జోడీగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తారనే ప్రచారం జరగగా.. ఇప్పుడు అది నిజమవుతోంది.
ఇక మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, కార్తిక్, శర్వరి జోడీ కూడా త్వరలో ఓ ప్రేమకథా చిత్రానికి సంతకం చేసినట్టు సమాచారం. 2025 చివరిలో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, 'పతి, పత్నీ ఔర్ వో 2' లో శర్వరికి ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం ఆఫర్ అందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.