మరోసారి ‘తను వెడ్స్ మను’ జోడీ !

తనతో ‘తను వెడ్స్ మను’ లో నటించిన ఆర్. మాధవన్‌తో కంగనా మరో సినిమా చేయబోతుండడం విశేషం.;

By :  K R K
Update: 2025-01-28 01:10 GMT

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ .. కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ ఇటీవల థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పనులను ప్రారంభించింది. ఈ సినిమా బాలీవుడ్ అభిమానులకు ఒక సర్ప్రైజ్‌ కాబోతోంది. తనతో ‘తను వెడ్స్ మను’ లో నటించిన ఆర్. మాధవన్‌తో కంగనా మరో సినిమా చేయబోతుండడం విశేషం.

లేటెస్ట్ గా .. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షూటింగ్ సెట్స్ నుండి ఒక ఫొటోను పంచుకుంది. ఆ ఫొటోలో ఒక క్లాపర్‌బోర్డ్ కనిపిస్తోంది. అందులో షూటింగ్ డే వివరాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కంగనా అండ్ ఆర్. మాధవన్ మరో సారి జోడీగా నటిస్తున్నారు. కంగనా తన స్టోరీస్‌లో " సినిమా సెట్స్‌లో ఉండడం కన్నా ఆనందకరమైనది మరొకటి లేదు" అని వ్యాఖ్యానించింది.

కంగనా లేటెస్ట్ మూవీ ‘ఎమర్జెన్సీ’ సినిమా విషయానికొస్తే.. ఇది ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ తర్వాత ఆమె రెండవ డైరెక్టోరియల్ మూవీ. జనవరి 26 నాటికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 10 రోజుల పూర్తి చేసుకుంది. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించ లేకపోయింది. అయితే ఈ సినిమా రిజల్ట్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. ఇప్పుడు తన దృష్టినంతటినీ .. మాధవన్ తో చేయబోయే సినిమాపైనే పెట్టింది. మరి ఈ సినిమా ఇద్దరికీ మరో ‘తను వెడ్స్ మను’ మూవీ అవుతుందేమో చూడాలి.

Tags:    

Similar News