150 సెన్సార్ కట్స్ తో ‘ఉదయ్ పూర్ ఫైల్స్’
స్క్రీన్‌పైకి రాకముందే, ఈ సినిమాకు ఏకంగా 150 సీన్స్ కట్‌లు సూచించారు సెన్సార్ వారు. ఇది చిన్న మార్పు కాదు, సినిమా సినిమా మొత్తం పూర్తిగా కత్తిరించడమే.;
2022లో రాజస్థాన్‌లో కన్హయ్య లాల్ దారుణ హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఉదయ్ పూర్ ఫైల్స్’. ఇప్పటికే ఈ సినిమా పబ్లిక్ డిస్కోర్స్‌లోనే కాకుండా, సెన్సార్ బోర్డ్ ఆఫీస్‌లో కూడా సంచలనం సృష్టిస్తోంది. స్క్రీన్‌పైకి రాకముందే, ఈ సినిమాకు ఏకంగా 150 సీన్స్ కట్‌లు సూచించారు సెన్సార్ వారు. ఇది చిన్న మార్పు కాదు, సినిమా సినిమా మొత్తం పూర్తిగా కత్తిరించడమే. భరత్ శ్రీనెట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఇటీవలి కాలంలో అత్యంత భావోద్వేగ రేఖలను తాకిన నిజ జీవిత నేరంపై ఆధారపడింది. దీనికి స్పందన కూడా అంతే తీవ్రంగా ఉంది.
ట్రైలర్‌లు విడుదలైన వెంటనే, సినిమా స్కానర్‌లోకి వచ్చింది. జమియత్ ఉలేమా-ఏ-హింద్ వంటి ముస్లిం సంస్థలు, సమాజవాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ వంటి రాజకీయ నాయకులు ఈ సినిమా సామాజిక అగ్నిని రగిలిస్తుందని, ఒక సమాజాన్ని టార్గెట్ చేస్తుందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కూడా దీన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్లు వచ్చాయి. బహుశా ఒత్తిడిలోనే.. సెన్సార్ బోర్డ్ 150 సీన్‌లను కత్తిరించాలని సూచించింది.
ఇంత భారీగా కట్‌లు చేస్తే సినిమా ఏ రూపంలో మిగులుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ గందరగోళం మధ్య, దర్శకుడు భరత్ శ్రీనెట్ తన సృష్టిని సమర్థిస్తున్నాడు. "ఇది మతం గురించి కాదు, ఇది భావజాలం గురించి. ఇది సత్యం గురించి," అని అతను స్పష్టం చేశాడు. ఈ చిత్రం ఈ దారుణ హత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తుందని, ద్వేషాన్ని రెచ్చగొట్టడం కాదు, అవగాహన కల్పించడమే లక్ష్యమని అతను చెప్పాడు. రజనీష్ దుగ్గల్, ప్రీతి ఘుంగియాని, కాంచి సింగ్ వంటి నటులతో ఈ సినిమా గట్టి కథనాన్ని అందించాలని భావించింది. కానీ ఇప్పుడు, ఈ కట్‌ల తర్వాత సినిమా తన పదునును కోల్పోయిందా అన్న సందేహం నెలకొంది.
ఇక్కడ రెడ్ కార్పెట్ హడావిడి, సంతోషకరమైన రిలీజ్ సెలబ్రేషన్స్ లేవు. కేవలం ఉద్రిక్తత, ఆగ్రహం, ఊహాగానాలు మాత్రమే. ‘ఉదయ్ పూర్ ఫైల్స్’ ఈ కట్‌లను తట్టుకొని నిలబడుతుందా, లేక వివాద భారంతో కుప్పకూలుతుందా? సెన్సార్ చేసిన వెర్షన్ స్క్రీన్‌పైకి రాగానే, కేవలం సినిమా రిలీజ్ కోసమే కాదు. సినిమా స్క్రీన్‌పై ఎంతలా నిలబడుతుందో అన్న పబ్లిక్ తీర్పు కోసం కూడా కౌంట్‌డౌన్ మొదలైంది.