హృతిక్ ఎమోషనల్ పోస్ట్
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’. లేటెస్ట్ గా ఈ క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.;
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’. లేటెస్ట్ గా ఈ క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ పోస్ట్ తో తెలియజేయగా.. లేటెస్ట్ గా గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కూడా 'వార్ 2' గురించి ఓ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
దాదాపు 149 రోజుల పాటు కొనసాగిన ఈ విరామం లేని షూటింగ్ షెడ్యూల్‌లో తాను అనుభవించిన అనుభూతులను హృతిక్ ఓ ఎమోషనల్ పోస్టు ద్వారా తెలిపాడు. 'చేజ్‌లు, యాక్షన్, డ్యాన్స్, బ్లెడ్, గాయాలు.. ఇలా 149 రోజుల ఈ ప్రయాణం ఎంతో విలువైనది. తారక్ సర్ (జూనియర్ ఎన్టీఆర్) మీతో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా భావిస్తున్నా. కియారా అద్వానీలోని మరో డేంజరస్ యాంగిల్ ను ఆడియన్స్ ఈ సినిమాలో చూస్తారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రాల సినిమాటిక్ విజన్‌ను ప్రేక్షకులు థియేటర్లో ఆస్వాదించబోతున్నారు. 'వార్ 2' టీమ్‌లోని ప్రతిఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘కబీర్’ పాత్రకు వీడ్కోలు చెప్పడం కాస్త తీయగా, కాస్త బాధగా ఉంది' అంటూ హృతిక్ రాశాడు.
ఈ సందర్భంగా హృతిక్ తన ఇంట్లో ఎన్టీఆర్, కియారా, అయాన్, ఆదిత్య సహా యష్ రాజ్ ఫిల్మ్స్ టీమ్‌కు ప్రత్యేక డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయడం విశేషం. 'వార్ 2' చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది.