‘బూత్ బంగ్లా’ మూవీలో బెంగాలీ విలన్ !

ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర కోసం ప్రఖ్యాత బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఎంపికయ్యారు.;

By :  K R K
Update: 2025-03-16 03:04 GMT

హారర్-కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన "భూత్ బంగ్లా" చిత్రంపై సినీప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌తో అభిమానులను మరింత ఉత్సాహపరుస్తూ మేకర్స్ ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర కోసం ప్రఖ్యాత బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఎంపికయ్యారు. ప్రత్యేకంగా జిషు పుట్టినరోజున ప్రకటించడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టైలిష్ ఫోటోను షేర్ చేస్తూ, మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.

‘అద్భుతమైన నటుడు జిషు సేన్ గుప్తా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 'భూత్ బంగ్లా'లో మీ మ్యాజిక్ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇది నిజంగా ఓ రోలర్‌కోస్టర్ రైడ్‌లా ఉండబోతోంది’ అని నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ లోకి జిషును ఆహ్వానించారు. ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్‌ల బాలాజీ టెలిఫిల్మ్స్ మరియు అక్షయ్ కుమార్ ప్రొడక్షన్ హౌస్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫారా షేక్, వేదాంత్ బాలి ఈ చిత్రానికి సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ హారర్-కామెడీ సినిమాలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ కలయికను దర్శకుడు ప్రియదర్శన్ మళ్లీ తెరపైకి తీసుకురావడం విశేషం. గతంలో వీరి కలయికలో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్, ప్రియదర్శన్ ట్రేడిషనల్ హాస్య శైలి, సమర్థవంతమైన నటీనటుల సమాహారంతో "భూత్ బంగ్లా" ప్రేక్షకులను మెప్పించే వినోదభరితమైన చిత్రంగా నిలవబోతోంది. ఈ చిత్రంలో అక్షయ్, పరేష్ రావల్‌తో పాటు తబు, రాజ్‌పాల్ యాదవ్, మిథిలా పాల్కర్, వామిఖా గబ్బి వంటి టాలెంటెడ్ నటీనటులు కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News