లండన్ వీధుల్లో లవ్ బర్డ్స్ !

రీసెంట్‌గా లండన్‌లో వీరి వెకేషన్‌కి సంబంధించిన ఒక సూపర్ క్యూట్ వీడియో వైరల్ అవుతోంది.;

By :  K R K
Update: 2025-06-19 13:08 GMT

బాలీవుడ్ అందాల సుందరి జాన్వీ కపూర్, క్యూట్ బాయ్ శిఖర్ పహారియా జోడీ చాలా కాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ లవ్‌బర్డ్స్‌ని ఎన్నో సందర్భాల్లో స్పాట్ చేశారు జనం. గతంలో తిరుమల తిరుపతి లాంటి పవిత్ర క్షేత్రాల్లో కనిపించిన ఈ జంట, ఇప్పుడు తమ రిలేషన్‌షిప్‌ని ఓపెన్ సీక్రెట్‌గా మార్చేశారు. అభిమానులు, మీడియా ఈ జంట గురించి మాట్లాడుకోవడం ఆపడం లేదు.

ఇప్పుడు మరోసారి వీళ్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. రీసెంట్‌గా లండన్‌లో వీరి వెకేషన్‌కి సంబంధించిన ఒక సూపర్ క్యూట్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జాన్వీ, శిఖర్ లండన్ స్ట్రీట్స్‌లో చేతిలో చేయి వేసుకుని, చిల్ మూడ్‌లో నడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్పెషల్ ట్విస్ట్ ఏంటంటే, జాన్వీ సిస్టర్ ఖుషీ కపూర్ కూడా వీళ్లతో పాటు ఈ ట్రిప్‌లో జాయిన్ అయింది. ఈ త్రీసమ్‌ని చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే .. జాన్వీ కపూర్ ఫుల్ బిజీ బీ. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ “పెద్ది” అనే సినిమా షూటింగ్‌లో ఉంది. అటు.. ఎన్టీఆర్‌తో “దేవర 2”లో కూడా ఆమె నటించనుంది. కానీ ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ రూమర్ ఏంటంటే.. ఆమె అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందట. ఈ పుకారు నిజమైతే, జాన్వీ కెరీర్‌లో మరో బిగ్ బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Tags:    

Similar News