షారుఖ్ - దీపిక ఐదోసారి !

దీపికా పదుకొణె ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.;

By :  K R K
Update: 2025-05-02 08:33 GMT

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న భారీ చిత్రం ‘కింగ్’ . ఈ మూవీపై ఇటీవలగా చాలా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో దీపికా పదుకొణె ఉంటుందో లేదో అనే విషయం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దీపికా పదుకొణె ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

షారుక్‌ ఖాన్‌ సరసన దీపికా పదుకొణె నటించడం ఇది ఐదవ సారి. గతంలో ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌కి పరిచయమైన దీపికా.. ఆ తర్వాత ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘పఠాన్’, ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో షారుక్‌ కు జోడీగా నటించింది. ఇప్పుడు ‘కింగ్’ సినిమాతో ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుంది. ముందుగా దీపికా ఈ సినిమాలో కేవలం అతిథి పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఆమె పాత్ర పూర్తిస్థాయి పాత్రే అని వెల్లడైంది.

దీపికా ఇటీవలే తల్లి అయిన నేపథ్యంలో కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంది. బిడ్డతో సమయం గడపడంతో పాటు జిమ్‌లో శరీరాన్ని మళ్లీ ఫిట్‌గా మార్చుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ సమయంలో ‘కింగ్’ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో, ఇప్పుడు ఆమెకు కాలం కలిసి వచ్చిందని తెలుస్తోంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించనున్న తొలి ప్రాజెక్టుగా సుహానా ఖాన్‌కి ఇది బాలీవుడ్‌లో భారీ స్థాయిలో ఎంట్రీగా మారనుంది. ఈ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్, జైదీప్‌ అహ్లావత్‌ కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నట్టు సమాచారం. దీపికా చేరికతో ఈ సినిమా మీద మ‌రింత హైప్ ఏర్పడింది.

Tags:    

Similar News