'ఛావ' ట్రైలర్.. శంభాజీ గా విక్కీ కౌశల్ వీర విహారం!

Update: 2025-01-22 12:45 GMT

'ఛావ' ట్రైలర్.. శంభాజీ గా విక్కీ కౌశల్ వీర విహారం!'ఛావ' ట్రైలర్.. శంభాజీ గా విక్కీ కౌశల్ వీర విహారం!బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా నటించిన చిత్రం 'ఛావ'. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించింది. ‘ఛావ‘ చిత్రం ఆద్యంతం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్ నటించగా.. ఆయన భార్య యేసుబాయి భోన్సలే పాత్రలో రష్మిక కనిపించబోతుంది. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్త ఇతర కీలక పాత్రలు పోషించారు.


Full View


‘లూకా చుప్పి‘ ఫేమ్ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలోనే రావాల్సి ఉంది. పుష్ప 2 కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ గా ఫిబ్రవరి 14న విడుదలకు ముస్తాబవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఆద్యంతం శంభాజీ వీరోచిత పోరాట ఘట్టాలతో ఆకట్టుకుంటుంది. హిస్టారికల్ ఈవెంట్స్ తో రూపొందిన ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని ఎంతో భారీగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఎ. ఆర్. రెహమాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.

Tags:    

Similar News