‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ లడఖ్ షెడ్యూల్ పూర్తి !
లడఖ్‌లో 15 రోజుల పాటు సాగిన చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ కోసం సల్మాన్, చిత్ర యూనిట్ సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ వంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ చిత్రీకరణలో పాల్గొన్నారు.;
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. రాబోయే బయోపిక్ మూవీ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ కోసం లడఖ్‌లో 15 రోజుల పాటు సాగిన చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ కోసం సల్మాన్, చిత్ర యూనిట్ సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ వంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ చిత్రీకరణలో పాల్గొన్నారు.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్.. 2020లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన భీకర పోరాటంలో వీరమరణం పొందిన ధైర్యవంతుడైన భారత సైనికుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రను పోషించారు. సినిమా రెండో షెడ్యూల్ వచ్చే వారం ముంబైలో ప్రారంభం కానుంది.
అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 వేసవిలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఈ చిత్రం ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ అనే బెస్ట్ సెల్లింగ్ పుస్తక సిరీస్ ఆధారంగా రూపొందుతోంది. భారత సైనికుల అసాధారణ ధైర్యసాహసాల నిజమైన కథలను ఈ సిరీస్ వివరిస్తుంది. లడఖ్‌లోని నిజమైన ప్రదేశాలలో చిత్రీకరించిన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ దేశభక్తితో కూడిన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.