కేబీసీ సీజన్ 17కోసం అమితాబ్ కు అంత పారితోషికమా?

అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్ చేస్తున్నారట, అంటే వారానికి (5 ఎపిసోడ్‌లు) రూ. 25 కోట్లు అన్నమాట.;

By :  K R K
Update: 2025-07-19 01:13 GMT

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తన ఐకానిక్ క్విజ్ షో "కౌన్ బనేగా కరోడ్‌పతి" 17వ సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ కొత్త సీజన్‌తో ఆయన భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ హోస్ట్‌గా అవతరించారు. అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్ చేస్తున్నారట, అంటే వారానికి (5 ఎపిసోడ్‌లు) రూ. 25 కోట్లు అన్నమాట.

గతంలో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఓటీటీ వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లకు రూ. 24 కోట్లు తీసుకున్నారు. తాజా రిపోర్ట్స్ నిజమైతే.. బిగ్ బీ సల్మాన్‌ను అధిగమించి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ హోస్ట్‌గా నిలిచారు. అమితాబ్ బచ్చన్ 2000లో ప్రారంభమైన "కౌన్ బనేగా కరోడ్‌పతి" షోతో హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. మూడవ సీజన్ మినహా.. అమితాబ్ అన్నటికీ తానే హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సీజన్ కు మాత్రం షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు.

25 ఏళ్ళుగా హోస్ట్ గా కొనసాగిస్తున్న ఈ షోతో అమితాబ్ కున్న దీర్ఘకాల సంబంధాన్ని బట్టి.. ఆయన అధిక పారితోషికం సమంజసంగానే ఉంది. ఈ సీనియర్ నటుడు చివరిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన "వేట్టైయన్" చిత్రంలో కనిపించారు, ఇది ఫేక్ ఎన్‌కౌంటర్లపై దృష్టి సారించిన సినిమా.

Tags:    

Similar News