ఆలియా భట్ నిర్మాణంలో వెబ్ సిరీస్ !
అలియా భట్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలసి ఒక కొత్త వెబ్ సిరీస్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది.;
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న "లవ్ అండ్ వార్" చిత్రం సెట్స్‌పై ఉంది. అయితే ఆమె ప్రొడ్యూసర్‌గా రూపొందించనున్న తదుపరి ప్రాజెక్ట్ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తోంది. ఇప్పటివరకు అలియా కొత్తగా ఏం ప్లాన్ చేస్తోందన్నదానిపై ఎన్నో ఊహాగానాలు వచ్చినా.. అధికారికంగా ఏదీ ప్రకటించ లేదు. అయినా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్ హల్‌చల్ చేస్తోంది. ఇది ఇప్పటివరకు వచ్చిన వాటిలోనే పెద్దదిగా కనిపిస్తోంది.
అలియా భట్ తన ప్రొడక్షన్ కంపెనీ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మాతగా మారింది. నటిగా కెరీర్‌ను కొనసాగిస్తూనే, నిర్మాతగా తన బేనర్ కోసం కొన్ని ప్రాజెక్టులపై దృష్టిపెడుతోంది. తాజా సమాచారం ప్రకారం, అలియా భట్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలసి ఒక కొత్త వెబ్ సిరీస్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఇది 2024లో వచ్చిన "పోచర్" వెబ్ సిరీస్ తర్వాత ఆమెకు అమెజాన్ ప్రైమ్‌తో ఇది రెండో ప్రాజెక్ట్ అవుతుంది.
ఈ కొత్త వెబ్ సిరీస్‌కి సంబంధించిన తుది స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇది ఒక యంగ్ అడల్ట్ డ్రామాగా రూపొందుతోంది. ఇది ఒక ఆర్బన్ ఇండియన్ కాలేజ్ క్యాంపస్ నేపథ్యంలో సాగే కథ. ఒక విధంగా చెప్పాలంటే.. స్లైస్ ఆఫ్ లైఫ్, కమింగ్ ఆఫ్ ఏజ్ కథల మేళవింపు. కథనం రెండు జంటల దృష్టికోణం నుంచి సాగుతుంది. 20ల వయస్సులో ఉన్న, యథార్థానికి దగ్గరగా ఉండే నటుల్ని ఎంపిక చేయాలని ఆమె ఉద్దేశం. ఈ వెబ్ సిరీస్‌తో నాలుగు కొత్త ముఖాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అన్ని అనుకున్నట్టే జరిగితే, ఈ సిరీస్ ఈ సంవత్సరం చివరిలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.