చిరు ఫ్యాన్ నుంచి బాలయ్య ఫాలోవర్‌గా బాబీ!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో డైరెక్టర్ బాబీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.;
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో డైరెక్టర్ బాబీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
'తాను చిరంజీవి అభిమానిగా సినిమాల్లోకి వచ్చానని చెప్పినప్పుడు, బాలయ్య తనను మరింత గౌరవంగా చూశారని.. ఇతర హీరోల అభిమానుల్ని కొందరు అంగీకరించకపోవచ్చు. కానీ బాలయ్య అలా కాదు.. ఆయన నిజాయితీకి ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమతో ఎంకరేజ్ చేస్తారు. ఆయన ప్యూర్ హార్ట్ తనకు ఎంతో స్పూర్తినిచ్చింది' అని బాబీ అన్నాడు.
'బాలకృష్ణ గొప్ప మనసు, స్వచ్ఛత దగ్గరగా చూసి తెలుసుకున్నాను. ఆయన మాట నిలబెట్టుకుంటారు, నమ్మకం ఉన్నవారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారు' అని బాబీ బాలయ్య వ్యక్తిత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు.
అలాగే ''డాకు మహారాజ్'ను మించిన గొప్ప సినిమా బాలకృష్ణ గారితో భవిష్యత్తులో తీస్తానని మాట ఇస్తున్నా' అని బాబీ స్పష్టం చేశాడు.