బెల్లంకొండ 'కిష్కింధపురి'!

వినాయక్ తో చేసిన 'ఛత్రపతి' హిందీ రీమేక్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో వస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-04-27 06:02 GMT

వినాయక్ తో చేసిన 'ఛత్రపతి' హిందీ రీమేక్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో వస్తున్నాడు. ఇక ఈ యాక్షన్ స్టార్ చేస్తున్న ప్రతీ సినిమా ఎంతో వైవిధ్యంగా రెడీ అవుతోంది.

ముందుగా తమిళ 'గరుడన్' రీమేక్ 'భైరవం'తో ఆడియన్స్ ను అలరించనున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కాంబోలో మల్టీస్టారర్ గా రూపొందిన 'భైరవం' త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

'భైరవం'తో పాటు 'హైందవ' అంటూ మరో సినిమాని అనౌన్స్ చేశాడు. ఆమధ్య విడుదలైన 'హైందవ' టైటిల్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ‘హైందవ‘ పేరుకు తగ్గట్టే ఈ సినిమాలో హిందూ మైథలజీని ఎక్స్ ప్లోర్ చేయబోతున్నట్టు ఈ గ్లింప్స్ చూస్తేనే అర్థమయ్యింది.

ఇప్పుడు మళ్లీ మైథాలజీ టచ్ తోనే 'కిష్కింధపురి' అనే టైటిల్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రంగా ప్రచారంలో ఉన్న ఈ మూవీకి 'కిష్కింధపురి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తుండగా.. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండకి జోడీగా అనుపమ నటిస్తుంది. ఏప్రిల్ 29న ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రానుంది.

మరోవైపు 'భీమ్లా నాయక్' డైరెక్టర్ సాగర్ కె.చంద్రతో 'టైసన్ నాయుడు' కూడా బెల్లంకొండ కిట్టీలో ఉంది. ఇంకా నక్కిన త్రినాథరావుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ బెల్లంకొండ వారబ్బాయి.

Tags:    

Similar News