అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన సంవత్సరం!

ఈ ఏడాది అక్కినేని కుటుంబానికి బాగా కలిసొస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 'తండేల్'తో ఘన విజయాన్ని అందుకున్నాడు నాగ చైతన్య. అంతకు ముందు 'థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ' వంటి ఫ్లాపులతో ఉన్న చైతన్యకు 'తండేల్' మంచి కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది.;

By :  S D R
Update: 2025-06-22 14:09 GMT

ఈ ఏడాది అక్కినేని కుటుంబానికి బాగా కలిసొస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 'తండేల్'తో ఘన విజయాన్ని అందుకున్నాడు నాగ చైతన్య. అంతకు ముందు 'థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ' వంటి ఫ్లాపులతో ఉన్న చైతన్యకు 'తండేల్' మంచి కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చైతన్య, సాయిపల్లవి జోడీకి మంచి పేరొచ్చింది. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం 'తండేల్'కి మరో హైలైట్.

ఇదే సంవత్సరం అక్కినేని మనవడు సుమంత్ కి బాగా కలిసొచ్చింది. చాలా రోజులుగా విజయాలు లేని సుమంత్ కి 'అనగనగా' రూపంలో మంచి హిట్ దక్కింది. కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలపై పడే ఒత్తిడిని, మార్కుల మోతలో మానసికంగా ఎదుర్కొంటున్న వాస్తవాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ సన్నీ సంజయ్. ఈ మూవీలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ టీచర్‌గా సుమంత్‌ చూపించిన అభినయం ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదలవ్వడం విశేషం.

కట్ చేస్తే ఇప్పుడు 'కుబేర'తో కింగ్ నాగార్జునకు మంచి విజయం దక్కింది. గత చిత్రం 'నా సామి రంగ'తో ఫర్వాలేదనిపించిన నాగ్.. 'కుబేర'తో నటుడిగా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఈ మూవీలో నాగ్ పోషించిన దీపక్ పాత్రకు టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో రజనీకాంత్ 'కూలీ'తోనూ సందడ చేయబోతున్నాడు కింగ్ నాగార్జున.

మరోవైపు ఇదే ఏడాది రాబోతున్న 'లెనిన్' చిత్రంతో అఖిల్ కూడా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని నమ్ముతున్నారు అక్కినేని ఫ్యాన్స్. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్నాడు. ఆద్యంతం రాయలసీమ నేపథ్యంతో ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీలో అఖిల్ మేకోవర్ ఆకట్టుకుంటుంది. అఖిల్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది.

Tags:    

Similar News