ఓటీటీలోకి వచ్చేసిన ‘బేబీ జాన్’

Update: 2025-02-20 11:36 GMT

ఓటీటీలోకి వచ్చేసిన ‘బేబీ జాన్’తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తెరి’ బాలీవుడ్ లో ‘బేబీ జాన్’ గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కళీస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ స్టార్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించగా.. కీర్తి సురేశ్, జాకీ ష్రాఫ్, వామికా గబ్బి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్, సైనా మల్హోత్రా, షీబా చడ్డా ప్రత్యేక పాత్రల్లో అలరించారు.

డిసెంబర్ 25, 2024న థియేటర్లలో విడుదలైన బేబీ జాన్ మొదటి రోజున రూ. 11.25 కోట్లు వసూలు చేసింది. అయితే, రెండో రోజు వసూళ్లు భారీగా పడిపోయి రూ. 4.75 కోట్లకు పరిమితమయ్యాయి. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఆడియన్స్ ను ఆకట్టుకోడానికి వచ్చేసింది.

ఈ సినిమాలో తన పాత్ర గురించి వరుణ్ ధావన్ చెబుతూ "బేబీ జాన్ నా కెరీర్‌లో ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఇది నాకు కొత్త సవాలు. కేవలం శారీరకంగా మాత్రమే కాదు, నటన పరంగా కూడా కొత్తకొత్త అంశాలను నేర్చుకున్నాను. అట్లీ వంటి టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. దర్శకుడు కళీస్, కీర్తి, వామికా, జాకీ శ్రాఫ్ వంటి అద్భుతమైన నటీనటులతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది," అని తెలిపాడు. మరి ఈ సినిమా ఓటీటీలో అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

Tags:    

Similar News