‘బలగం‘ తరహా ఎమోషన్స్ తో ‘బాపు‘

‘బలగం‘ తరహాలో ఆద్యంతం తెలంగాణ నేపథ్యంలో రాబోతున్న మరో చిత్రం ‘బాపు‘. ‘బలగం‘ ఫేమ్ సుధాకర్‌ రెడ్డి టైటిల్ రోల్ లో కనిపించబోతున్న ఈ మూవీలో బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో నటించారు.;

By :  S D R
Update: 2025-01-29 09:07 GMT

ఆద్యంతం తెలంగాణ నేపథ్యం, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో వచ్చిన ‘బలగం‘ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. విజయాన్ని సాధించడమే కాకుండా పలు వేదికలపై అవార్డులను కొల్లగొట్టింది. ‘బలగం‘ తర్వాత తెలంగాణ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చినా.. మళ్లీ అంతటి ప్రభావం చూపించినవి లేవనే చెప్పాలి. తాజాగా ‘బలగం‘ తరహాలో ఆద్యంతం తెలంగాణ నేపథ్యంలో రాబోతున్న మరో చిత్రం ‘బాపు‘.


‘బలగం‘ ఫేమ్ సుధాకర్‌ రెడ్డి టైటిల్ రోల్ లో కనిపించబోతున్న ఈ మూవీలో బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ‘బాపు: ఎ ఫాధర్ సూసైడ్ స్టోరీ‘ అంటూ సహజమైన ఎమోషన్స్ తో దయా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఫిబ్రవరి 21న ‘బాపు‘ మూవీ విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    

Similar News