టీజర్ తో ఇంప్రెస్ చేసిన అశ్విన్!

యంగ్ హీరో అశ్విన్‌బాబు తన కెరీర్‌ను పూర్తిగా యాక్షన్ బాటలో తీర్చిదిద్దుకుంటున్నాడు. 'హిడింబ, శివం భజే' వంటి డిఫరెంట్ కాన్సెప్టులతో ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ట్రీట్ అందించిన అశ్విన్.. లేటెస్ట్ గా 'వచ్చినవాడు గౌతమ్' సినిమాతో వస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-05-16 04:51 GMT

యంగ్ హీరో అశ్విన్‌బాబు తన కెరీర్‌ను పూర్తిగా యాక్షన్ బాటలో తీర్చిదిద్దుకుంటున్నాడు. 'హిడింబ, శివం భజే' వంటి డిఫరెంట్ కాన్సెప్టులతో ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ట్రీట్ అందించిన అశ్విన్.. లేటెస్ట్ గా 'వచ్చినవాడు గౌతమ్' సినిమాతో వస్తున్నాడు. మిస్టరీ, యాక్షన్‌తో మేళవించిన ఈ మెడికో థ్రిల్లర్‌కు మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదలైన టీజర్‌లో 'ధర్మం దారి తప్పినప్పుడు.. ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడు గౌతమ్‌' అన్న డైలాగ్‌తో థ్రిల్‌కు తలుపులు తెరిచారు. ఈ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌ను ఇచ్చింది హీరో మంచు మనోజ్. ఈ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ బాగా ఎలివేట్ అయ్యింది.

ఈ చిత్రంలో రియా సుమన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అజయ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, సాయి రోనక్, వైవా రాఘవ, విద్యులేఖ, షకలక శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గౌర హరి సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తంగా టీజర్ తో 'వచ్చినవాడు గౌతమ్' ఇంప్రెస్ చేశాడనే చెప్పొచ్చు.


Full View


Tags:    

Similar News