అనుపమకు అత్యంత ఇష్టమైన సినిమా 'పరదా'
అనుపమ పరమేశ్వరన్ తన సినీ ప్రస్థానంలో అత్యంత ఇష్టమైన చిత్రంగా 'పరదా'ని అభివర్ణించింది. లేటెస్ట్ గా జరిగిన ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలు చేసింది.;
అనుపమ పరమేశ్వరన్ తన సినీ ప్రస్థానంలో అత్యంత ఇష్టమైన చిత్రంగా 'పరదా'ని అభివర్ణించింది. లేటెస్ట్ గా జరిగిన ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలు చేసింది. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మరో మలయాళీ నటి దర్శన రాజేంద్రన్, సీనియర్ హీరోయిన్ సంగీత ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ టీజర్ ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియాలో విడుదల చేయగా, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నిర్మాత శరత్ మరార్ ముఖ్య అతిథులుగా హాజరై టీజర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. 'ఈ టీజర్ చూసినప్పుడు.. తన పదేళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యానని, ఈ చిత్రం తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందని' అన్నారు. దర్శన రాజేంద్ర మాట్లాడుతూ ఈ చిత్రం ఎన్నో సవాళ్ల మధ్య రూపొందిందని, ప్రవీణ్ తన హృదయాన్ని ఈ కథలో ప్రతిఫలింపజేశాడని కొనియాడారు.
పరిశ్రమలో అన్ని రకాల సినిమాలు రావాలని, నాయికా ప్రధాన చిత్రాలకు కొత్త కమర్షియల్ అర్థం కల్పించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు దర్శకుడు ప్రవీణ్ వెల్లడించారు. త్వరలో 'పరదా' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.