గ్లామర్ గేట్లు తెరిచాకా అనుపమకు వరుస ఆఫర్స్ !
"టిల్లు స్క్వేర్" సూపర్ హిట్ కావడంతో అనుపమకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.;
పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మల్లూ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. "టిల్లు స్క్వేర్" సినిమాతో ఆమె గ్లామర్ డోర్స్ తెరిచింది. ఇప్పటివరకు హోమ్లీ పాత్రల్లోనే కనిపించిన ఈ సుందరి ఆ సినిమాలో మాత్రం అదిరిపోయే గ్లామర్ లుక్కుతో మెరిసింది. ఈ మార్పు చూసి అభిమానులు ఆశ్చర్యపోవడంతో పాటు ఫిదా అయ్యారు.
అనుపమ కెరీర్‌ను "టిల్లు స్క్వేర్"కు ముందు, తర్వాతగా విభజించవచ్చు. కళ్లతో హావభావాలు పలికించి మంత్రముగ్ధులను చేసే అనుపమ.. కొంత కాలం పాటు హోమ్లీ లుక్స్‌లో మాత్రమే కనిపించడం వల్ల స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించడంలో వెనుకబడింది. ఈ నేపథ్యంలో.. గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. "టిల్లు స్క్వేర్" సూపర్ హిట్ కావడంతో అనుపమకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం అనుపమ చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. మలయాళంలో రెండు, తమిళంలో మూడు, తెలుగులో ఒక ప్రాజెక్టు చేస్తున్నారు. అందులో "పరదా" అనే తెలుగు చిత్రానికి విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమిళంలో "లాక్ డౌన్" వంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేయడం విశేషం. అలాగే యంగ్ హీరోలైన ధ్రువ్ విక్రమ్‌తో "బిసోన్", ప్రదీప్ రంగనాథ్‌తో "డ్రాగన్" చిత్రాలు చేస్తున్నారు. "జీఎస్కే ట్రూత్ షాల్ అల్వేస్ ప్రీవేల్", "పెట్ డిటెక్టివ్" వంటి ప్రాజెక్టులు కూడా లైన్‌లో ఉన్నాయి.