‘డ్రాగన్‘ కోసం మరో నిర్మాణ సంస్థ!
‘ఆర్.ఆర్.ఆర్, దేవర‘ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఎన్టీఆర్. ఇక ‘కేజియఫ్, సలార్‘ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు ప్రశాంత్ నీల్.;
‘ఆర్.ఆర్.ఆర్, దేవర‘ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఎన్టీఆర్. ఇక ‘కేజియఫ్, సలార్‘ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు ప్రశాంత్ నీల్. అలాంటి ఈ ఇద్దరి కాంబోలో ఇప్పుడు సినిమా రూపొందుతుంది.
ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి మరో అగ్ర నిర్మాణ సంస్థ చేరిందట. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ టి-సిరీస్ కూడా ‘ఎన్టీఆర్-నీల్‘ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యమయ్యిందట. ‘డ్రాగన్’ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో టి-సిరీస్ కూడా కలవడంతో నిర్మాణ విలువలు, ప్రమోషనల్ వ్యూహాలు మరింత భారీ స్థాయిలో ఉండనున్నాయి.
అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. తొలి షెడ్యూల్స్‌లో ఎన్టీఆర్ లేకపోయినా, ఈరోజు నుంచి ప్రారంభమైన కొత్త షెడ్యూల్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకోసం మంగళూరులో కీలక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా వస్తోంది అనుకున్నా.. సమ్మర్ టార్గెట్ గా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.