అమీర్ ‘మహాభారతం‘లో అల్లు అర్జున్?
ఇటీవల జరిగిన వేవ్స్ సమ్మిట్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సౌత్-నార్త్ సమ్మేళనంగా అల్లు అర్జున్ - షారుక్ ఖాన్ కాంబోలో సినిమా వస్తే అదొక రేంజులో ఉంటుందని వెల్లడించాడు. ఇప్పుడు అలాంటి తరహా కాంబోనే తెరపైకి రాబోతుంది.;
ఇటీవల జరిగిన వేవ్స్ సమ్మిట్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సౌత్-నార్త్ సమ్మేళనంగా అల్లు అర్జున్ - షారుక్ ఖాన్ కాంబోలో సినిమా వస్తే అదొక రేంజులో ఉంటుందని వెల్లడించాడు. ఇప్పుడు అలాంటి తరహా కాంబోనే తెరపైకి రాబోతుంది.
తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లి అల్లు అర్జున్ కలుసుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సమావేశం వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యంపై ఇంకా స్పష్టత రాలేదు.
‘పుష్ప 2‘తో పాన్ ఇండియాని షేక్ చేసిన బన్నీ.. ప్రస్తుతం అట్లీ కాంబినేషన్‌లో 'AA 22' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు అమీర్ తన ‘సితారే జమీన్ పర్‘ను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'మహాభారతం'ను పట్టాలెక్కించనున్నాడు.
అమీర్ ఖాన్ రూపొందించే ‘మహాభారతం‘లో పలు భాషలకు సంబంధించిన సూపర్ స్టార్స్ నటించనున్నారట. ‘మహాభారతం‘ కోసమే అమీర్ ఖాన్ ను అల్లు అర్జున్ కలుసుకున్నాడా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు అల్లు ఫ్యామిలీకి అమీర్ ఖాన్ కి చాలా ఏళ్ల క్రితం నుంచే మంచి అనుబంధం ఉంది.
అమీర్ ఖాన్ నటించిన ‘గజిని‘ బాలీవుడ్ లోనే తొలి వంద కోట్లు సాధించిన చిత్రంగా నిలిచింంది. ఆ సినిమాను నిర్మించింది అల్లు అరవింద్ కావడం విశేషం. మొత్తంగా.. అల్లు అర్జున్, అమీర్ ఖాన్ మీటింగ్ నేపథ్యం ఏంటి? అనే దానిపై వాళ్లు క్లారిటీ ఇచ్చే వరకూ ఏ విషయమూ స్పష్టత రాదు.