సైఫ్ ఆలీఖాన్ కు విలన్ గా అక్షయ్ కుమార్

Update: 2025-05-05 09:34 GMT

సైఫ్ ఆలీఖాన్ కు విలన్ గా అక్షయ్ కుమార్ఇది బాలీవుడ్ చరిత్రలోని అత్యంత ఆసక్తికరమైన వార్త. స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి విలన్ గా అక్కట్టుకోబోతున్నాడు. శంకర్ 2:0 సినిమా తర్వాత అక్కీ మరోసారి విలన్ అవతారం ఎత్తబోతున్నాడు. అయితే అది సౌత్ మూవీ. కానీ ఇప్పుడు అక్షయ్ నటించబోయేది హిందీ మూవీ అవడం విశేషం.

ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా థ్రిల్లర్ సినిమాలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్‌కు విరోధిగా కనిపించనున్నాడు. ఇందులో సైఫ్ అంధుడి గా నటించనుండడం విశేషం.

ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఆయనతో అక్షయ్ కుమార్ చాలా సంవత్సరాల తర్వాత కలసి పనిచేస్తున్న ప్రాజెక్టు కావడం విశేషం. ఈ ఇద్దరూ కలిసి గతంలో హెరా ఫేరి, భూల్ భులయ్యా, గరం మసాలా వంటి హిట్ సినిమాలను అందించారు. అయితే, ఈసారి వారు హాస్యానికి బదులుగా పూర్తి స్థాయి థ్రిల్లర్ తో అదరగొట్టబోతున్నారు.

ఈ సినిమా మోహన్‌లాల్ నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ఒప్పంకి హిందీ రీమేక్. ఇది 2025 ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి, ఒకే షెడ్యూల్లో పూర్తి చేసి 2026 రెండో భాగంలో విడుదల చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. సైఫ్-అక్షయ్ మధ్య జరిగే ఈ మైండ్ గేమ్, ప్రియదర్శన్ స్టైల్ కథనంతో కలిపితే, బాలీవుడ్ థ్రిల్లర్‌లకు కొత్త ఒరవడిని తీసుకొస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News