అజిత్ తెలుగు ప్రమోషన్స్ షురూ!
తమిళ తల అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ మూవీ రిలీజ్ కు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై తమిళనాట భారీ అంచనాలున్నాయి. ఎక్కువగా తమిళంపైనే ఫోకస్ పెట్టిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘.. అసలు తెలుగులో వస్తోందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
లేటెస్ట్ గా వాటిన్నంటినీ పటాపంచలు చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ‘మార్క్ ఆంటోని‘తో కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రెండు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం అజిత్ మాస్ ర్యాంపేజ్ తో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో కథను ఏమాత్రం రివీల్ చేయలేదు. అజిత్ మాత్రం రెండు, మూడు గెటప్స్ లో తనదైన స్వాగ్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు.
అజిత్ కి జోడీగా త్రిష నటించగా.. మరో సీనియర్ బ్యూటీ సిమ్రాన్ మరో కీ రోల్ లో కనువిందు చేయబోతుంది. ఇంకా సునీల్, యోగి బాబు, ప్రసన్న, ప్రభు, ప్రియా ప్రకాష్, జాకీ ష్రాఫ్, అర్జున్ దాస్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించింది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. మొత్తంగా ఏప్రిల్ 10న తమిళంతో పాటు తెలుగులోనూ అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కాబోతుంది.