'కల్కి' ప్రభంజనానికి సంవత్సరం!
రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 A.D' రిలీజై ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది జూన్ 27న ఈ చిత్రం రిలీజయ్యింది. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ విజనరీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ డ్రామా పాన్-ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించింది.;
రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 A.D' రిలీజై ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది జూన్ 27న ఈ చిత్రం రిలీజయ్యింది. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ విజనరీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ డ్రామా పాన్-ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , దీపికా పదుకొనె వంటి భారీ తారాగణంతో తో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
'కల్కి' విడుదలై సంవత్సరం పూర్తైన సందర్భంగా చిత్ర బృందం షేర్ చేసిన పోస్టును అమితాబ్ బచ్చన్ 'ఎక్స్'లో రీపోస్టు చేస్తూ, ఈ చిత్రంలో భాగమవడం తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. మొత్తంగా.. ఇండియా నుంచి రాబోయే క్రేజీ సీక్వెల్స్ లో 'కల్కి 2' కూడా ఉంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'కల్కి 2' త్వరలోనే పట్టాలెక్కుతుందని చెబుతుంది టీమ్.