భయానికి కామెడీ టచ్!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లేటెస్ట్ గా వర్మ తన తర్వాతి సినిమాని ప్రకటించాడు.;

By :  S D R
Update: 2025-04-10 03:05 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లేటెస్ట్ గా వర్మ తన తర్వాతి సినిమాని ప్రకటించాడు. ‘సత్య, కౌన్, శూల్’ వంటి క్లాసిక్ సినిమాల తర్వాత విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి వర్మ చేస్తున్న సినిమా పేరు 'పోలీస్ స్టేషన్లో దెయ్యం'.

ఈసారి వర్మ కొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఇప్పటివరకు క్రైమ్, హారర్, థ్రిల్లర్, పొలిటికల్ డ్రామాలపై ఫోకస్ చేసిన వర్మ, ఇప్పుడు హారర్‌కు కామెడీని జోడిస్తూ భయాన్ని హాస్యంగా మలచబోతున్నాడు. 'పోలీస్ స్టేషన్లో దెయ్యం' అనేది ఈ సినిమాకి పెట్టిన టైటిల్ కాగా, 'You Can't Kill The Dead' అనేది ఈ మూవీకి ట్యాగ్ అని చెప్పాడు వర్మ.

'ప్రజలు భయపడితే పోలీసుల వద్దకు పరుగెత్తుతారు. కానీ పోలీసులకే దెయ్యం భయం వేసినప్పుడు.. వారు ఎక్కడికి పారిపోతారు?' అనేది ఈ సినిమా కథగా సోషల్ మీడియాలో తెలిపాడు వర్మ.

ఒక ఘోరమైన ఎన్‌కౌంటర్ తర్వాత హాంటెడ్ స్టేషన్‌గా మారిన పోలీస్ స్టేషన్ నేపథ్యంలో ఈ కథ సాగనుందట. గ్యాంగ్‌స్టర్లు, దెయ్యాల బెదిరింపుల మధ్య పోలీసుల పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. అంటున్నాడు వర్మ.



Tags:    

Similar News