'మ్యాడ్' హీరోతో నిహారిక సినిమా!

మెగా డాటర్ నిహారిక నిర్మాతగా స్పీడు పెంచుతుంది. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఓటీటీ ఆడియన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లను నిర్మించిన నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు‘తో సిల్వర్ స్క్రీన్ పైనా ప్రొడ్యూసర్ గా అదరగొట్టింది.;

By :  S D R
Update: 2025-04-02 11:16 GMT

మెగా డాటర్ నిహారిక నిర్మాతగా స్పీడు పెంచుతుంది. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఓటీటీ ఆడియన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లను నిర్మించిన నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు‘తో సిల్వర్ స్క్రీన్ పైనా ప్రొడ్యూసర్ గా అదరగొట్టింది. ‘కమిటీ కుర్రోళ్లు‘ తర్వాత నెక్స్ట్ మూవీకోసం రెడీ అవుతుంది నిహారిక.

నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు‘ గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. య‌దు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాలామంది నూతన నటీనటులు నటించారు. ఇప్పుడు తన ప్రొడక్షన్ లో రెండో చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాకి నిహారిక నిర్మించిన ‘బెంచ్ లైఫ్‘ వెబ్ సిరీస్ ద్వారా దర్శకురాలిగా పరిచయమైన మానస శర్మ దర్శకత్వం వహిస్తుంది. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరో.

‘మ్యాడ్‘ సిరీస్ తో హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సంగీత్ శోభన్. తనకంటూ సెపరేట్ కామెడీ టైమింట్ తో ‘మ్యాడ్‘ హీరోలు ముగ్గురిలోనూ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అసలు సంగీత్ శోభన్ ను ‘ఒక చిన్న కుటుంబ కథ‘తో ముందుగా పరిచయం చేసింది నిహారిక కావడం విశేషం. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.

Tags:    

Similar News